ప్రత్యేకంగా కొన్ని సమయాలను కాఫీ సమయంగా గుర్తించాలని పరిశోధనలు చెపుతున్నాయి. ఆ టైమ్ లో కనుక ఓ కప్పు కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు అంటున్నారు. అదెలాగంటే మన శరీరం చేసే పనులను నియంత్రించే కార్టిపోల్ అనే హార్మోన్ ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలలోపు ,అలాగే మధ్యహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదున్నర గంటల మధ్య ఎక్కువగా విడుదల అవుతుంది. ఆసమయంలో కనుక కాఫీ తాగితే శరీరం మరింత చురుగ్గా ఉంటంతో పాటు చక్కని ఆరోగ్యం కూడా సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. భోజనం తర్వాత కాఫీ తాగే అలవాటు ఉంటే ఓ గంట విరామం ఇచ్చి తాగితే మంచిదని సలహా ఇస్తున్నారు.

Leave a comment