కాఫీని ఇష్టపడని వాళ్ళుంటారా అనచ్చు. నిద్ర లేస్తూనే కాఫీ తో ఉదయాన్నే  మొదలు పెట్టే వాళ్ళు  లెక్కలకు అందరు. కానీ ఎంత ఇష్టమైనా సారే కాఫీని ఉదయాన్నే  తాగొద్దు అంటున్నారు నిపుణులు. 10 గంటల నుంచి 11 గంటల ౩౦ నిమిషాల తర్వాత తాగితే మంచిది అంటున్నారు. ఇదే మంచి సమయం అన్నది నిపుణుల అభిప్రాయం. అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐడు గంటలలోగా డల్ గా ఉంటే ఓ కప్పు  తాగొచ్చు.  అలాగే భోజనం తో పాటు కానీ భోజనం తర్వాత కానీ తాగకూడదు. దీని వల్ల శరీరానికి ఐరన్ అందదు. కాఫీని భోజనం చేసిన ఓ గంట తర్వాతే తాగాలి. అలాగే సాయంత్రం ఐదు తర్వాత తాగితే రాత్రి నిద్ర పట్టకపోవోచ్చు  అంటున్నారు. ఇక నిద్ర లేక అలసట తప్పదు అని హెచ్చరిస్తున్నారు. ఇది ఒక పరిశోధన సారాంసం మాత్రమే.

Leave a comment