పిల్లలకు ఇష్టమైన కాండీ లాలిపాప్ ఇప్పుడు టీ, కాఫీ కోసం కూడా లాలీపాప్ లు వచ్చాయి. టీ బ్యాగ్ ల్లాగే వీటిని వేడి నీళ్లు వేడి పాలల్లో ముంచి నచ్చిన పానీయం తయారు చేసుకోవచ్చు. బ్లాక్ టీ, లెమన్, అల్లం, హెర్బల్ ఫ్లవర్, ఫ్రూట్ టీ లు వెనిల్లా, హాట్ చిల్లీ టీ, స్పైస్ టీ అంటూ రకరకాల లాలీ పాప్ లు వచ్చాయి. కాఫీ లాలీ పంచదార, కాఫీ పొడి కలిపిన సిరప్ తో చేస్తారు. ఇందులోనూ క్యారమెల్ సిన్నమన్   లాటి, పెప్పర్ మింట్ లాటి వంటి ఎన్నో ఫ్లేవర్లు ఉన్నాయి. అలాగే షుగర్ లాలీపాప్స్, బ్రౌన్ షుగర్ తో కూడా వస్తున్నాయి. వీటిలో కుంకుమ పువ్వు కలిపినవి కూడా ఉన్నాయి.పైగా వీటిలో కొన్ని చప్పరించి తినేందుకు వీలు గా ఉన్నాయి.

Leave a comment