ఎంతో ఆరోగ్యం కదా అని గుడ్డు తినిపించాలని చూస్తే పిల్లల మొహం తిప్పేస్తారు తెల్లగా రుచిగా లేని గుడ్డు తినటం అంటే కష్టమే మరి. గుడ్డులోని శక్తిమంతమైన ప్రొటీన్లు, రిబోఫ్లేవిన్ ఎడి ఇకె విటమిన్లు ఖనిజాలు ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయి.వీటిని పిల్లలు చేత తినిపించాలంటే ఎడిబుల్ కలర్స్ తో రంగులు మార్చేయండి అంటున్నారు షెఫ్ లు. ఐరోపా అమెరికాల్లో ఈ ఈస్టర్ పండుగకు సంతాన సాఫల్యతకు పుట్టుక కి సంకేతమైన గుడ్డుని రంగు రంగులతో అలంకరించి కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. అలాగే గుడ్డు కు రంగులేయచ్చు .రంగుల కోసం పసుపు, బీట్ రూట్, క్యారెట్,ఎరుపు వంకాయ రంగు క్యాబేజీ, పాలకూర, బెర్రీలు,నల్ల ద్రాక్ష వంటివి  వాడొచ్చు. నీళ్లలో వెనిగర్ వేసి మనం కోరుకున్న రంగు కూరగాయ ముక్కలు వేసి మరిగించి ఆ నీళ్లతో ఉడకబెట్టిన పెంకు తీసిన గుడ్డు వేస్తే సరే గులాబీ రంగు గుడ్డు కావాలంటే బీట్ రూట్ ముక్కలు మరిగించిన నీళ్లలో నానబెడితే చాలు. వంకాయి రంగు రావాలంటే ఇంకో రెండు స్పూన్ లు బేకింగ్ సోడా వేయాలి. పసుపు వేసిన నీళ్లలో గుడ్డు నానబెడితే పసుపు రంగు వస్తుంది ఇలా రంగు రంగుల గుడ్డు చూపెడితే కళ్ళకి నచ్చేసి వెంటనే తినేస్తారు పిల్లలు. మరి పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలనుకొంటే ఇలాటి ట్రిక్స్ నేర్చుకోవాలి మరి !

Leave a comment