ఎప్పుడు ఏదో ఒక డిజైన్ ఉన్న దుస్తులనే ఎంచుకోనక్కరలేదు. ఎలాంటి హంగులూ లేకుండా కొన్నిసార్లు ఒక సాదరంగు తో ప్రత్యేకంగా కనిపించవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. పౌడర్ బ్లూ, పసుపు, ఐస్ బ్లూ, పీచ్, సముద్రం నీలం వంటివి ఫ్యాషన్ కలర్స్.  సిల్క్, సాటిన్, కాటన్ సిల్క్, జార్జెట్ తరహా వస్త్రాలు ప్రత్యేకంగా కనిపించాలి. అనుకుంటే చిన్నగా అంచులు బుటీలు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మొత్తం ఒకే రంగులో భారీ బ్లౌస్ వేసుకుంటే ఇతర వస్తువుల ఎంపికల ప్రత్యేకత కనిపించాలి. ఎంబ్రాయిడరీ బెల్ట్ లు క్లచ్ పర్సులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అలాగే సాదా చీరె కు పూర్తి భిన్నంగా ఉండే బ్లౌజ్ కు వేసుకోవాలి పీచ్-ఎరుపు, ఆకుపచ్చ సముద్రం నీలం- స్నాప్  పౌడర్ బ్లూ ముదురు పసుపు వంటివి భిన్నంగా ప్రయత్నిస్తే సాదా రంగుల చీరెలే ఎంతో ఫ్యాషన్ లుక్ ఇస్తాయి.

Leave a comment