కరుణ, క్షమాగుణం మూర్తీభవించిన మహాత్ముడు బుద్ధుడు. మదర్ థెరీసా ను కరుణామూర్తి గా పిలుస్తారు. కరుణ నిండిన నా హృదయంలో కోపానికి, ద్వేషానికి చోటులేదు అసహనాన్ని అన్యాయాన్ని జోడించే అద్భుత శక్తి కరుణ హృదయంలో కరుణ నిండి ఉంటే ఒత్తిడి దగ్గరకు రాదనీ అది ఆధ్యాత్మిక ప్రగతికి దారితీస్తుందని చెబుతారు శాస్త్రవేత్తలు. స్వార్థానికి తావివ్వని క్షమాగుణం తో నిండిన కరుణ మానవ జాతిని ఏకం చేస్తుంది. కరుణ  భావోద్వేగం కాదు అది జీవిత విధానం ప్రతిఫలాన్ని ఆశించకుండా కృతజ్ఞత ప్రశంసలకు చోటు ఇవ్వకుండా ఒక మనిషి మరో మనిషి తో పంచుకోగలిగే గొప్ప వరం కరుణ. మనిషిని శక్తి మంతుడిని చేసే కరుణ ప్రేమ వంటిదే.అది  విశ్వప్రేమ సాటి మనిషిని సంపూర్ణంగా అర్థం చేసుకునే దిశగా మన ఆలోచనలు మళ్ళించుకోవటం కరుణని పెంపొందించుకునే మార్గం కరుణ లేనిదే సమాజానికి మనుగడలేదు.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134 

Leave a comment