నాన్న కు ప్రేమతో సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత సరైనాడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుకచుద్దాం, సపిదర్ సినిమాలు చేసింది కానీ డబ్బింగ్ చెప్పుకోలేదు.  కొత్త సంవత్సరంలో ఆమె ఓ మంచి నిర్ణయం తీసుకుందిట. తెలుగులో ఆమె చేసే కారెక్టర్స్ కి ఆమె సొంత గొంతు వినిపించాలనుకుంటుందిట. నేను తెలుగు ఎంతో బాగా మాట్లాడతాను. నా మాతృ బాష పంజాబీ కన్నా నేను తెలుగు లో మాట్లాడితే బాగా అనిపిస్తుంది. 2018  నుంచి నేను చేసే సినిమాలన్నింటికీ నేను అలాగే కమిట్ అయ్యా నంటుంది రాకుల్. ఎంత బాగా యాక్ట్ చేసినా నా గొంతు తో నేను మాట్లాడితేనే నేను పూర్తి నటిగా ఫీలవ్వుతానంటుంది రాకుల్. కొత్త సంవత్సరపు నిర్ణయం మంచిదే.

Leave a comment