స్త్రీ ,పురుషుల మెదడు నిర్మాణాలు పుట్టుకలో ఒకేలా ఉన్నా యవ్వనంలోకి అడుగు పెట్టేక ఎన్నో మార్పులు వస్తాయి . మెదడు లోని ఒక భాగం మరో భాగానికి కలిపే నాడుల నిర్మాణం స్త్రీ ,పురుషుల్లో భిన్నంగా ఏర్పడుతుంది . పురుషుని మెదడు కొత్త అంశాలను నేర్చుకునేందుకు . ఆ నేర్పును ప్రదర్శించేందుకు అనువుగా రూపు దిద్దుకొంటే ,ఆడవారి మెదడు జ్ఞాపక శక్తి ,సామాజికంగా నలుగురితో కలిసి పనిచేయవలసి అంశాల్లో మెరుగ్గ తయారవుతుంది . పురుషులు లాజికల్ గా ఆలోచించేందుకు సిద్ధపడతారు . వారి ఎడమ వైపు మెదడు భాగం చురుగ్గా తయారవుతుంది . అలాగే స్త్రీ లలో కుడివైపు భాగం మెరుగ్గా పనిచేసి వాళ్ళు ప్రతి విషయాన్నీ ముందుగా ఆలోచించటం మొదలు పెడతారు . కుడి,ఎడమ భాగాలు కలిసి పని చేయవలసిన పరిస్థితి వస్తే స్త్రీలే చురుగ్గా ఆలోచించ గలిగారు .

Leave a comment