ఏదైనా ,ఎంత కష్టమైనా ఎలాగైనా సాధిస్తాను కానీ ఒకే ఒక్క చిక్కు కాస్త అయోమయంగా ఉండటం అంటుంది కాజల్ .ఆమె నటిస్తున్నా పారిస్ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నా అయోమయం విషయంలో పెద్ద కారణాలు ,విషయాలు ఉండవు .చాలా చిన్న విషయాల్లో కన్ఫ్యూజన్  అవుతాను. ఈ రోజు వేసుకోనే డ్రెస్ గురించి వార్ట్ రోబ్ ముందు నిలబడి ఏ రంగో తేల్చుకోలేక పోతాను . ఒక ఐస్ క్రీమ్ తినాలంటే ఏ ఫ్లేవరో తేల్చుకోలేక పోతాను . మా అమ్మ అయితే చాలా నవ్వుతుంది. ఈ కన్ఫ్యూజన్ నీ పెళ్ళీ విషయంలో అప్లై చేయకు .నీకు కావలసిన భర్తను కన్ఫ్యూజన్ లేకుండా ఎంచుకో అంటుంది. ఆమె నవ్వినా  నా సమస్య ఇది. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయట పడేందుకు ఎంతో ప్రయత్రం చేస్తా…అయినా కన్ఫ్యూజన్ అంటూ నవ్వేసింది కాజల్.

Leave a comment