30 సంవత్సరాల అర్చన ఆగ్రాకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఝాన్సీ .ఈ మధ్యనే ఆమెకు బదిలీ అయింది. ఆమె భర్త గుర్ గావ్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ఇద్దరు ఉద్యోగులు కావడంతో మొదటి పాపను తల్లిదండ్రులవద్ద వదిలేసి ఆరు నెలల తన రెండో పాపని తీసుకుని ఝాన్సీ వచ్చి విధుల్లో చేరింది.ఇంట్లో ఎవరు చూసుకునే వాళ్ళు లేక పాపాని తీసుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఎదురుగా ఉన్న బల్ల పై పడుకోబెట్టి తన విధులు నిర్వర్తించేది. అక్కడికి వచ్చిన ఉన్నతాధికారులు తల్లి,పిల్లని చూసి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అర్చన కు డ్యూటీ పట్ల ఆమె నిబద్దతకు ప్రశంసలు కురిపించి ఆమెను సొంత ఊరికి ట్రాన్స్ ఫర్ చేశారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ లో తీసిన ఈ ఫోటోకి దానికి క్యాప్షన్ అవసరం లేదు అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.

Leave a comment