ఎండల్లో పిల్లల్ని బయటకు తీసుకు పోయే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు ఉదయం పది నుంచి సాయంత్రం ఏడు వరకు వేళ్ళనే వద్దు. అధిక ఉష్ణోగ్రతలో ఆరు మాసాలలోపు పిల్లలు త్వరగా డిహైడ్రేట్ అయ్యే ప్రమాదం వుంది. కాటన్ డైపర్ క్లాత్ లే వేయాలి. ఆహారం తీసుకునే పెద్ద పిల్లలకు లస్సీ, మిల్క్ షేక్, ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు ఇవ్వాలి. వీటిలోని పోషకాలు పిల్లలకు నీరసం రానీయవు. బయట దొరికే పండ్ల రాసాలు తాగించకూడదు. అందులో కలిపే ఐస్ కోసం వాడే నీళ్ళు శుభ్రంగా లేకపోవొచ్చు. పిల్లలను బయటకి తీసుకు పొతే ఇంట్లో వండిన ఆహారం తీసుకుపోవాలి. నూనెతో మసాజ్ లు మానేయాలి వేడికి చర్మం కంది పోతుంది. వేసవి కదా అని దోమతెరలు పక్కన పెట్టొద్దు, దోమల వల్ల వచ్చే జ్వరాల నుంచి పిల్లలకు రక్షణ వుండదు. రెగ్యులర్ గా ఇంట్లో వాటర్ కూలర్లు వాడుతుంటే వారానికొక సారైనా ట్యాంక్ క్లీన్ చేయాలి.
Categories
WhatsApp

కూల్ డ్రింకుల్లో కలిపే ఐస్ తో సమస్యే

Leave a comment