బరువు తగ్గాలని అనుకొనే వాళ్ళు కూల్ వాటర్ కు దూరంగా ఉండాలి అంటారు ఎక్సపర్ట్స్. చల్లని నీరు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ను మరింత గట్టిగా మారేలా చేస్తుంది. ఫలితంగా కొవ్వు కరిగించుకోవడం కష్టం అవుతుంది. మెడ నుంచి ప్రారంభం అయ్యే వాగస్ నాడీ  గుండె ఊపిరితిత్తులో జీర్ణవ్యవస్థను నియంత్రిస్తుంది. బాగా చల్లని నీళ్ళు వేగంగా నరాలను చల్లబరుస్తాయి. ఫలితంగా గుండె వేగం, పల్స్ రేట్ తగ్గిపోతాయి ముఖ్యంగా వేసవిలో వర్క్ వుట్స్ తర్వాత చల్లని నీళ్లు అస్సలు తాగవద్దు అంటారు. వర్క్ వుట్స్ సమయంలో శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది. వెంటనే చల్లని నీళ్లు తాగితే ఉష్ణోగ్రతలో అసమతుల్యత ఏర్పడుతుంది. చల్లని నీళ్ళను శరీరం గ్రహించడం కష్టం అవుతుంది.

Leave a comment