ప్లాస్మా దానంతో ఓ  జీవితాన్ని కాపాడండి అన్న క్యాప్షన్ తో కోపాల్ 19 యాప్ తయారు చేశారు ఐఐటి విద్యార్థిని కాశికా ప్రజాపత్.ఈమె రూపొందించిన యాప్ కోపాల్ 19 తో కరోనా బాధితులకు సరిపోయే ప్లాస్మా దాతను గుర్తించవచ్చు.రోగులకు దాతలకు అనుబంధంగా పనిచేసే ఈ యాప్ లో ఆసక్తి ఉన్న దాతలు తమ పేరు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, బ్లడ్ గ్రూప్ చికిత్స చేయించుకున్న ఆసుపత్రి వివరాలు వైద్యుల వివరాలు నమోదు చేయాలి. వీటి ఆధారంగా ఆ వ్యక్తి ప్లాస్మా దానానికి అర్హత కాదా అనేది వైద్యులు నిర్ణయిస్తారు .అవసరమైనప్పుడు దాతను సంప్రదిస్తారు. నెలరోజుల్లోనే తయారు చేసిన ఈ యాప్ అభివృద్ధిలో తుషార్‌ చౌధురి, తనయ్‌ అగర్వాల్‌, ఎయిమ్స్‌ వైద్యులు డాక్టర్‌ అభినవ్‌ సింగ్‌ వర్మ, వరిధ్‌ కాటియార్‌ల సహకారం అందించారు

Leave a comment