ముత్యాల హారాల్లాగే పగడాల హారాలు కూడా వస్తున్నాయి . మధ్యదరా సముద్రంలో ,జపాన్ ,తైవాన్ సమీపంలోని సాగరాల్లో జీవిస్తూ ఉంటాయి . ఆలా అతుక్కునేందుకు కెరోటిక్ తో కూడిన కాల్షియం కార్బోవేట్ ని స్రవిస్తాయి . అవి మొక్కల్లా పెరుగుతాయి . వీటిని కోసి శుద్ధి చేసి పగడాలు తయారు చేస్తారు . గులాబీ,ఎరుపు,ముదురు ఎరుపు, నారెంజ్ ఇలా అనేక వర్ణాలతో ఇవి కనిపిస్తాయి . ముదురు ఎరుపు కోరల్ నే రెడ్ కోరల్ అని పిలుస్తారు . ఇవి చాల ఖరీదు . ఈ పగడాలని పువ్వుల్లా కత్తిరించి బంగారం ,ప్లాటినం వంటి లోహాల్లో పొదిగిన అందమైన నగలు తయారు చేస్తాన్నారు . ఈ పగడాల పూల నగలకు ఇవ్వాళ చాలా డిమాండ్ . పెండెంట్లు దిద్దాల ఉంగరాలు నెక్ల్ స్ లు అన్ని రకాల డిజైన్ లతో రంగుల్లో దొరుకుతున్నాయి .

Leave a comment