కరోనా కాలం మొదలయ్యాక తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో మనం వింటున్న ప్రత్యేకమైన కాలర్ ట్యూన్ విశాఖపట్నానికి చెందిన దగ్గు రాళ్ల పద్మావతి గళం.కొవిడ్ పై  ప్రజల్లో చైతన్యం వచ్చేలా వివిధ భాషల్లో కాలర్ ట్యూన్ ను తెచ్చారు. ఈ క్రమంలో తెలుగు లో రెండు రకాల కాలర్ ట్యూన్ లో ఇచ్చారు పద్మావతి .ఒకటి కరోనా రక్షణ చర్యలు రెండవది వైద్యుల,పోలీసులు,పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలని కోరుతూ ఇంకో కాలర్ ట్యూన్. వైజాగ్ లో డిగ్రీ చేసిన పద్మావతి ఢిల్లీలో ఉంటున్నారు ఎం.ఏ సోషియాలజీ చదివిన పద్మావతి ఒక ప్రైవేట్ సంస్థలు కాన్స్ లైంటి గా పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలపై అవగాహన కల్పించే రేడియో కార్యక్రమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు పద్మావతి.

Leave a comment