ఈ కరోనా సమయంలో ఔషధ కషాయం తాగమంటున్నారు ఆయుర్వేద వైద్యులు.ఇందుకు కావాల్సిన పదార్థాలు ధనియాలు అర కప్పు, జీలకర్ర పావు కప్పు, మిరియాలు రెండు టేబుల్ స్పూన్లు, సోంపు ఒక టీ స్పూన్,యాలుకలు, లవంగాలు 10, పసుపు అర టీ స్పూన్ సొంఠి పొడి అర టీ స్పూన్, తాటి బెల్లం రెండు టీ స్పూన్లు, నీరు రెండున్నర కప్పులు పాలు పావు కప్పు ముందుగా ధనియాలు జీలకర్ర మిరియాలు సోంపు, యాలుకలు, లవంగాలు సన్నని మంటపైన మాడిపోకుండా కొంచెం వేయించుకొని చల్లారాక పసుపు సొంటి పొడి కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి.ఈ పొడి గట్టి మూత ఉన్న డబ్బాలో పోసి పెట్టుకోవాలి. నీళ్లు బాగా మరగనిచ్చి ఆ నీళ్లలో ఈ పొడి మూడు టీ స్పూన్లు వేసి రెండు నిమిషాలు బెల్లం కలిపి ఇంకొంచెం సేపు వేడి చేసి అందులో చల్లని పాలు పోసి వేడి వేడిగా ఉన్నప్పుడే తాగాలి రోగనిరోధకశక్తిని పెంచే మంచి పానీయం ఇది.

Leave a comment