ఎదుగుతున్న కొద్దీ ప్రతి సంవత్సరం శరీరంలో వచ్చే మార్సులను బట్టి బ్రాసైజు మార్చుకొంటూ ఉండమని,కనీసం చెక్ చేసుకోమని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. కాస్త బరువు పెరిగామనో, లేదా తగ్గామనో అనుకోగానే బ్రా గురించి కూడా ఆలోచించాలి. బ్రా స్ట్రాప్ బుజాలపై బరుసుకుపోతూ ఉంటే సైజు మరీ చిన్నగా ఉన్నదని అర్థం. లోపల బ్రా బిగుతుగా అనిపిస్తే పెద్దకప్ సైజు ఎంచుకోవాలి. స్థనాల సైజును బట్టి బ్రాకప్స్ ఎంచుకోవాలి. వెనక వైపు కండరాలు ఈడ్చినట్లు కనిపిస్తే బ్రా బ్యాండ్ మరీచిన్నగా ఉన్నట్లు అర్ధం. సరిగ్గా బ్రా ఫిట్ అవకపోతే మెడ,వెన్ను ,బుజాల నొప్పులకు కారణం అవుతుంది. అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు ,ప్రసవం అయ్యాక కూడా బ్రా విషయంలో మార్పులు చేసుకోవాలి.

Leave a comment