అందానికీ ఆరోగ్యానికీ పసుపుని మించింది లేదని మన ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం నిరూపించాక కూడా ఈ పసుపుని మనకన్నా పాశ్చాత్య లే ఎక్కువగా తినేస్తున్నారని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. వాళ్లు తినే ఆహార పదార్థాలు పసుపురంగు పులుము కుంటున్నాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయం లో ముఖ్య పాత్ర పోషించిన పసుపు అందంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మొహానికి రాస్తే మొటిమలు మరకలు పోతాయి మొహం మెరిసిపోతుంది. పాదాలకు రాస్తే పగుళ్లు పోతాయి ఇన్ఫెక్షన్లు రావు. వంటల్లో వాడకం సరే సరే జ్వరం వచ్చిన జలుబు చేసిన పాలలో చిటికెడు పసుపు వేసి తాగితే తెల్లారే సరికి మాయం కావాలి. వేల సంవత్సరాల క్రితమే పసుపు లో ఉండే కర్‌క్యుమిన్‌ రసాయనం చేసే అద్భుతాలను సాంప్రదాయ ఆయుర్వేద వైద్యులు తెలుసుకొన్నారు. సకల వ్యాధులకు కర్‌క్యుమిన్‌ మందులా పనిచేస్తుందని అధ్యయనాలు వెల్లడించడంతో,సూపర్ ఫుడ్,మెడికల్ స్పైస్ అంటూ ఆహారాన్ని పసుపు మాయం చేస్తున్నాయి ప్యాశ్చాత్య కంపెనీలు. గోల్డెన్ మిల్క్ పేరుతో వట్టి పాలే కాదు,కాఫీ,టీ,ఐస్ క్రీమ్ బన్ బ్రెడ్ కేక్,కుకీస్, చాక్ లెట్స్,నెయ్యి, తేన మొత్తం అన్నింటినీ పసుపు మిక్స్ చేసి తయారుచేస్తున్నారు. స్పూన్ల కొద్దీ పసుపు తాగేస్తున్నారు ప్రస్తుతం ఈ కరోనా సమయంలో పసుపు క్రేజీ ఫుడ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో పసుపు సాగు చేస్తున్నారు. కానీ ఉత్పత్తిలో ప్రథమస్థానం భారతదేశానిదే. ఆహారంలో భాగంగా తీసుకొంటే మిరియాలు,ఫ్యాటీ ఆమ్లల తో కలిపి తీసుకొంటే మేలు. రోజుకు మూడుసార్లు పసుపు టీ లేదా కాషాయం తాగితే ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. ఇన్ని లాభాలున్నాయికనుకనే పసుపుకి ఇప్పుడు ఇంత డిమాండ్ !

Leave a comment