ఎన్నో కొత్త ఫ్యాషన్స్ వస్తున్నా అమ్మాయిల ఇష్టం లెహంగాలు, క్రాప్ టాప్ ల మీది నుంచి మరలి పోలేదు. అయితే లెహంగ  విషయంలో కొన్ని జాగ్రత్తలు కావాలి.   కొనుగోలు చేసే ముందర సులభంగా నడిచేందుకు ,కూర్చునేందుకు వీలుగా ఉందా,లేదా చూసుకోవాలి. ప్రస్తుత వాతావరణానికి కాటన్లు, ఇతర వస్త్రశ్రేణి అయితే బాగుంటాయి. లెహాంగ సరిగా ఎత్తుకు సరిపోయేల వుందా? ఎత్తు చెప్పులు వేసుకొన్న సౌకర్యంగా వుందా? చూసుకోవాలి. డిజైనర్ లెహంగా  కొనేటప్పుడు అది బరువు వుందా? శరీరానికి సౌకర్యంగా ఉందా చూసుకోవాలి. అద్దంలో చూసి వెంటనే ఓకే   అనకుండా దాన్నీ ఫోటో తీసుకొని ఆ లెహంగా   రంగు, డిజైన్ శరీరానికి నప్పేయో లేదో సరిచూసుకోవాలి.

Leave a comment