నిరంతరం మాస్క్ తోనే గడపటంతో ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి మాట్లాడేప్పుడు మాస్క్ కదులుతూ ఉండటం,వదులుతున్న గాలి,నోటి నుంచి వచ్చే తడితో బాక్టీరియా ఏర్పడుతుంది. సన్నపాటి గుల్లలు రావటం మొదలవుతోంది. ఎన్ 95 మాస్క్ ల తయారీలు పాలిస్టర్ లేదా నైలాన్ వస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఇవి అన్ని రకాల చర్మ తత్వాలకు సరిపడవు. అలాటప్పుడు కాటన్ మాస్క్ ఒక్కటే ప్రత్యామ్నాయం. మాస్క్ ధరించే ముందర ముఖం శుభ్రంగా కడిగి తుడుచుకొని ఆరిపోయాక తేలిక పాటి మాయిశ్చ రైజర్,సన్ స్క్రీన్ లోషన్ గానీ రాయాలి. మేకప్ లో వాడే గాఢమైన క్రీములు వాడితే చర్మరంద్రాలకు గాలి తగలదు. అలా శ్రద్ధగా ఉంటే మాస్క్ వాడకం వల్ల ఇబ్బందుల రాకుండా ఉంటాయి.

Leave a comment