కాటన్ చీరెలు చాలా అందం ఇస్తాయి కానీ చాలా సార్లు ఉతికితే చీరె మెరుపు పోతుంది. తొందరగా పాతబడి పోతాయి.ప్యూర్ కాటన్ చీరెలైతే ఎంత ఖరీదైనా ఈ మధ్య సమస్య ఎక్కువ. ఎప్పటికప్పుడు సరికొత్తగా కనించాలి అనుకొంటే కాస్త శ్రధ్దపెట్టాలి. మొదటిసారి కాటన్ శారీ ఉతికేప్పుడు నీళ్లలో రెండు మూడు స్ఫూన్లు ఉప్పు వేసి చీరెను నాన నివ్వాలి. ఇది అదనపు రంగును తీసేస్తుంది. అలాగే రెండు కాటన్ చీరెలు కలిపి ఎప్పుడూ ఉతకకూడదు.ఒక దాని రంగు ఒక దానికి అంటుకొనే ప్రమాదం ఉంటుంది. ఇస్త్రీ కూడా మరింత వేడితో చేయకూడదు. ఈ వేడికి కూడా చీరె షేడ్స్ మారుతాయి. మరీ ఎండలో ఆరేయకుంండా కాస్త నీడ పట్టున ఆరేస్తేనే మంచిది. ఎండ తగిలే వైపు చీరె రంగు మారితే చీరె పనికి రాకుండా పోతుంది.

Leave a comment