దీప్సిక గురించి సిక్కిం ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు రాష్ట్రం నుంచి దేశానికి సేవలు అందించే రెండో వ్యక్తిగా నిలిచినందుకు అబినందనలు నిన్ను చూస్తే ఎంతో గర్వాంగా ఉంది దీప్సిక అన్నారు. మిలిటరీ యూనిఫాం, చేతిలో తుపాకీ, మెడలో స్టెత్ తో మంచులో దాదాపుగా నడుము వరకూ కూరుకుపోయి పహారా కాస్తున్నా దీప్సిక ఫోటో స్ఫూర్తి దాయకంగా ఉంది. మహిళా సైనికులకూ శాశ్వత కమిషన్‌ ప్రకటించిన కొద్ది కాలానికే దేశ నియంత్రణ రేఖ దగ్గర పహారా కాసే అవకాశాన్ని దక్కించుకొంది డాక్టర్  దీప్సిక ఛెత్రి. ఈమె పహారా వరకే కాదు సేనలను ముందుండి నడిపించే కెప్టెన్ కూడా. దీప్సిక సిక్కింలోని గ్యాంగ్‌టక్‌ లో పుట్టింది. రాజేంద్ర కుమార్‌ ఛెత్రి, బిందు ఛత్రి తన అమ్మానాన్నలు. సిక్కిం మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నుంచి ఎంబీబీఎస్‌ చేసింది. మిలిటరీపై ఆసక్తితో ఆర్మీ మెడికల్‌ ఎగ్జామ్‌ రాసింది.అమ్మాయిల్లో రెండో ర్యాంకు సాధించింది.అలా ఆ రాష్ట్రం నుంచి ఎంపికైన మహిళా సైనికుల్లో రెండో వ్యక్తిగా నిలిచింది. శిక్షణ అనంతరం ఈమెను నియంత్రణ రేఖ దగ్గర నియమించారు. ఇక్కడ తను సైనిక విధులతోపాటు  వైద్య సేవలనూ అందించనుంది.మగవాళ్లకే కష్టమని భావించే నియంత్రణ రేఖ దగ్గర, ప్రతికూల వాతావరణంలో బాధ్యతలు నిర్వర్తిస్తోంది దీప్సిక ఛెత్రి. ఈమె ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తి దేశానికి గర్వకారణం కూడా !

Leave a comment