కోవిడ్ కారణంగా తలెత్తిన మానసిక వత్తిడి మహిళల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీసిందని చెబుతున్నారు నిపుణులు. ఎడిన్ బర్గ్ లో జరిగిన సొసైటీ ఫర్ ఎండోక్రినాలజీ వార్షిక సరస్సులో ,కోవిడ్ సమయంలో ఎదురైన మానసిక వత్తిడి మహిళలకు నెలసరి క్రమాన్ని దెబ్బతీసిందని ఇది సంతానోత్పత్తి సామర్ధ్యం పై తీవ్రంగా పడిందని నిపుణులు అంటున్నారు. ఆ సమయంలో నిద్రలేమి, ఒత్తిడి,ఆహార నియమాలు గతి తప్పటం హార్మోన్లను ప్రభావితం చేశాయి. ఇవి నెలసరి క్రమాన్ని నిపుణులు అభిప్రాయపడ్డారు డబ్లిన్ కు చెందిన లీసా ఓవెన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఓ సర్వేలో 1,300 మంది మహిళలపై చేసిన అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది అన్నారు. మానసికంగా ధైర్యంగా ఉండాలని ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని వారు మహిళలను హెచ్చరించారు.

Leave a comment