భారతీయ వంటకాలతో కోవిడ్ రిలీఫ్ ఫండ్ నిధులు సేకరించింది చెఫ్ ధృతి ఆరోరా .కలినరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికాలో గ్రాడ్యుయేషన్  చేసింది ముంబై వాషింగ్టన్ లోని రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేసింది. తరువాత డెన్మార్క్ లోని కోపెన్ హేగెన్ లోని నోమా రెస్టారెంట్ లో ఇంటర్న చెఫ్ గా స్థిరపడింది.కొవిడ్ కాలంలో రెస్టారెంట్ గడ్డు కాలాన్ని గట్టుక్కించేందుకు ధృతి భారతీయ వంటకాలను మెనూ కార్డులో చేర్చామని వాటిని కొనాలంటే 1500 రూపాయలు డొనేట్ చేయాలని నియమం పెట్టామని యాజమాన్యాన్ని కోరింది. ధృతి ఆలోచనను స్వాగతించిన యాజమాన్యం నాలుగు భారతీయ వంటకాలను మెనూలో చేర్చింది వారం రోజుల్లో రెండు లక్షల రూపాయలు నిధులు వచ్చాయి .ఈ నిధులను కోవిడ్ రోగుల కోసం ఉపయోగిస్తామని చెబుతోంది ధృతి.

Leave a comment