పాదాల పగుళ్ల తో ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఇంటి దగ్గరే పాదాలకు స్వాంతన ఇచ్చే చిన్న టిప్స్ పాటించవచ్చు నోటి శుభ్రత కోసం ఉపయోగించే మౌత్ వాష్ పొడిని వెడల్పాటి బకెట్ నీళ్లలో వేసి పది నిమిషాలు కాళ్లు అందులో పెట్టాలి తరువాత పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న తేనె పాదాల పగుళ్ళకు చక్కని మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది పగుళ్ళు ఉన్న చోట రాస్తూ వుంటే పగుళ్ళ బాధ తగ్గుతుంది. పొడి చర్మానికి కొబ్బరి నూనె తేమ అందిస్తుంది రోజూ నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనె రాసుకుంటే పగుళ్ళు పోతాయి.

Leave a comment