Categories
ఆదివాసీల హస్తకళల ఉత్పత్తులు క్రాఫ్ట్ పోట్లీ అన్న సంస్థ ద్వారా కస్టమర్స్ కు చేరుస్తున్నాను. నా ధ్యేయం క్రాఫ్ట్ టూరిజం హస్తకళలు ఉన్న గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా మార్చడం. కార్పొరేట్ ప్రాంతం లోని నియమ గిరి కొండల దగ్గర డోంగ్రియా తెగ ఆదివాసీలు గడ్డి తో చాలా అందమైన వస్తువులు తయారు చేస్తారు. 47 రకాల బియ్యం పండిస్తారు. అలాగే హడప గంధ అనే శాలువాలు అల్లుతారు. ఇలాంటి ఉత్పత్తులు మార్కెట్ చేయడం నా లక్ష్యం అంటుంది కావ్య సక్సేనా. జైపూర్ లో పుట్టిన కావ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పని చేసింది. నోయిడా లో ఫ్యాషన్ ఉత్పత్తుల రంగంలో పని చేసింది. భారతీయ పల్లెలు ఆమెకు ఎంతగానో నచ్చాయి. 2021లో ఒరిస్సా అడవుల్లో ఆదివాసి ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేస్తోంది కావ్య.