ఈ మధ్య అందరూ  క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులతో కొత్త నోట్ల కోసం బ్యాంకుల ఎటిఎం లకు వెళుతున్నారు. కార్డుల వినియోగంలో ఎటిఎం ల వాడకంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎటిఎం లకు వెళ్తుంటే మురికిపట్టి ఎన్నడూ వాడనట్లు అనిపిస్తున్న జోలికి వెళ్ళకూడదు. అవి బహుశా పనిచేయని ఎటిఎం లు కావచ్చు. లావాదేవీలు పూర్తీ కావాలంటే పిన్ నెంబర్ రెండు సార్లు ఎంటర్ చేయమని అడుగుతున్నా తేడా ఎదో ఉందని గమనించండి. సొంత బ్యాంక్ ఎటిఎం లు వాడటం మంచిది. మన అకౌంట్ ఉన్న బ్యాంకులైతే మోసాలకు తావుండదు. ఇక ఇ -షాపింగ్ కోసం సెక్యూర్ సాకెట్స్ లేయర్ S.S.L సర్టిఫైడ్ సైట్లనే వాడాలి. స్మార్ట్ ఫోన్ లో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని వల్ల  మాల్వేర్ అరికట్టటం ఈజీ అవుతుంది. పబ్లిక్ వైఫై నెటవర్క్  లైన్ డబ్బు లావాదేవీలు జరిపినా నష్టమే. పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మార్చితే ఐడెంటిటీ థెఫ్ట్ కు అవకాశం పోతుంది.

Leave a comment