Categories
త్రిష క్రికెట్ లో ఆల్ రౌండర్. టి 20 టోర్నమెంట్ కు ముందే బ్యాటింగ్, బౌలింగ్ లలో రాణించింది. ఇటీవల ముగిసిన ప్రపంచ అండర్ 19 మహిళా క్రికెట్ టోర్నమెంట్ విజయంలో గొంగడి త్రిష పాత్ర ఎంతో ఉంది . తాజా గెలుపు తో ఈ అమ్మాయి రికార్డ్ ల మోత మోగించింది. త్రిష ది సాదాసీదా కుటుంబం భద్రాచలంలో స్పోర్ట్స్ ట్రైనర్ గా ఉన్న తండ్రి కూతురు లోని క్రికెట్ ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. తండ్రి కలను నిజం చేసింది త్రిష. ఈ టోర్నమెంట్ లో త్రిష క్రికెట్ విశ్వరూప ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచింది ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా త్రిషనే.
