వన్డే ప్రపంచ కప్ లో నిరాశ ఎదురైంది. ఇంకో ప్రపంచ కప్ ఆడే పరిస్థితి లేదు అలాంటప్పుడు క్రికెట్ లో కొనసాగటం లో అర్థం లేదు. అందుకే వీడ్కోలు పలికాను అంటోంది మిథాలీ రాజ్.రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్ లో ఎన్నో రికార్డ్ లు అందుకొన్న మిథాలీ ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికారు. భవిష్యత్ లో కూడా కెరీర్ క్రికెట్ మాత్రమే. కోచ్ గా ఉండచ్చు లేదా వ్యాఖ్యాత గానో నన్ను చూడచ్చు. దేశం కోసం ఇన్నాళ్లు ఆడినందుకు సంతృప్తిగా ఉంది ప్రపంచ కప్ గెలవ లేదన్న అసంతృప్తి తప్ప కెరీర్ పై పూర్తి సంతృప్తి తో ఉన్నాను అంటున్నారు మిథాలీ రాజ్.

Leave a comment