నేను నమ్మని విషయాలు ప్రజలకు చెప్పలేను అని తేల్చి చెప్పేసింది శిల్పా శెట్టి . ఒక ప్రముఖ ఆయుర్వేద కంపెనీ సన్న బడేందుకు వాడే మాత్రలను ప్రచార కర్తగా వ్యవహరించారని అందుకు గాను పది కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. ఇందులో శిల్ప ‘నో ‘ అనేసిందట సరైన ఆహార పద్దతిలో ఫాలో అయితే ఫిట్నెస్ దానంతట అదే వస్తుందని. సహజ పద్ధతుల ద్వారా బరువు తగ్గి తేనే ఆరోగ్యంగా ఉంటారని చెపుతోంది. ఈ కంపెనీ ఆఫర్ ఎంత గొప్ప దైన తన మనసుకి నచ్చిన సంగతులను ఎంత ఆర్థిక లాభం వచ్చే అంశమైనా చేయనని చెపుతోంది. కాస్త ఆలస్యమైనా జీవన శైలిలో మార్పులు చేసుకుంటే సన్న బడొచ్చు అంటోందామె ఫిట్నెస్,ఫుడ్ కి సంబందించిన ఒక యాప్ తీసుకువచ్చింది ఆమె ఈ యాప్ ద్వారా ఆహార నియమాలు ఫిట్నెస్ సలహాలు అడిగి తెలుసుకోవచ్చు.

Leave a comment