పాలమూరు జిల్లాలో అడవులు విస్తీర్ణం పెంచేందుకు గాను కోటి విత్తన బంతులు తయారుచేసి అటవీశాఖ అధికారులు గ్రామ పంచాయతీల సహకారంతో అడవుల్లో చల్లారు.ఈ కోటి విత్తన బంతులు తయారుచేసే బాధ్యత తీసుకున్నారు పాలమూరు మహిళా సంఘాల సభ్యులు. జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 284 మహిళ సమాఖ్యల్లోని 69 200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు తొమ్మిది రోజుల్లో సభ్యులందరూ కలిసి 1,0326,077 విత్తన బంతులు తయారు చేశారు. అడవుల్లో అధికారులు డ్రోన్ల సహాయంతో బంతులు వెదజల్లితే కొన్ని గ్రామాల మహిళ సంఘాల మహిళలు అడవుల్లోకి నడుచుకుంటూ వెళ్లి విత్తన బంతులు చల్లారు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి పాలమూరు మహిళలు చేపట్టిన కోటి విత్తన బంతులు కార్యక్రమాన్ని ప్రసంగిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Leave a comment