ఇంటి ముందు ఖాళీ స్థలం వుంటేచాలు కావలిసిన పూలు పండ్లు మొక్కలు పెంచుకోవచ్చు. అయితే ఇంకాస్త కొత్తదనం కావాలి అనుకొంటే ఆర్టి ఫిషయిల్ టోపియరీ యానిమల్స్ లేదా గ్రాస్ యానిమల్స్ కొన్నింటిని తెచ్చి పెట్టుకోవచ్చు .బుల్లి బుల్లి ఉడతలు, తేళ్ళు, కుక్కపిల్లలు వంటివి ఫైబర్ వంటి పదార్థం తో చేసి పైన కృత్రిమ గడ్డి కప్పుతారు. ఇవి నిజంగా గడ్డి బొమ్మల్లాగే కనిపిస్తాయి. పార్కుల్లో పబ్లిక్ ప్లేసుల్లో రకరకాల డిజైన్ లలో జంతువులు ఆ కారాల్లో మొక్కలన్నీ కట్ చేస్తూ పెంచుతారు. ఇళ్ళల్లో అలాంటివి సాధ్యం కాదు కనుక ఇలాటి గడ్డి బొమ్మలు తెచ్చి పెట్టుకోవచ్చు. ఆన్ లైన్ లో ఇమేజస్ చూసి ఇష్టమైనవి ఆర్డర్ ఇవ్వచ్చు .

Leave a comment