ఉద్యోగం రాలేదని ఏడ్చే వాళ్ళను చూసి వుంటాం. కానీ ఏడ్చే ఉద్యోగం చేసే వాళ్ళను ఎక్కడా చూడలేదు కదా. ఏడవటం ఒక ఉద్యోగమా ? అంటే ఉద్యోగమే చాలా డబ్బు తెచ్చే ఉద్యోగం కూడా. ప్రపంచ వ్యాప్తంగా ప్రొఫెషనల్ మౌర్నర్ (Mourner) అనే ఉద్యోగానికి ఎంతో డిమాండ్ ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోయిన పోయి చూడటం, కుటుంబ సభ్యులను పలకరించడం వంటివి చాలా మందికి కుదరటం లేదు అయితే చనిపోయిన వాళ్లకు ఆత్మశాంతి ఇచ్చేలా ఈ ఏడ్చే వాళ్లను బుక్  చేస్తున్నారు. వీళ్ళు గంటకు ఇంత చొప్పున డబ్బు తీసుకుని చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి కోసం మనస్ఫూర్తిగా ఏడుస్తారు.కొన్ని దేశాల్లో తమ చివరి యాత్రలో పాల్గొనేందుకు ఎవరికి వాళ్లే ముందే బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉందట.

Leave a comment