మనిషి ఆరోగ్యానికి నవ్వు ఎంత ముఖ్యమో ఏడుపు కూడా అంతే ముఖ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్,  ఎండార్షిన్ అనే ఫీల్ గుడ్ రసాయనాలు విడుదలై శారీరక మానసిక భావోద్వేగాల కు సంబంధించిన మార్పులు కలుగుతాయి.ఈ రసాయనాలతో శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది కన్నీళ్ళు కళ్ళలోని మలినాలను, దుమ్మును బయటకి పోగొడతాయి కన్నీళ్లు మూడు రకాల బాసల్ టియర్స్ కళ్ళను తేమగా ఉంచుతాయి. రిఫ్లెక్స్ టియర్స్ ఉల్లిపాయలు వంటివి  కోసినప్పుడు  కళ్ళ మంటలను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. మూడోది ఎమోషనల్ టియర్స్ ఇవి భావోద్వేగాన్ని సూచిస్తాయి వీటి వల్ల మానసిక వత్తిడి తగ్గుతుంది.

Leave a comment