కరెన్సీ వాడకం తగ్గించమంటుంది ప్రభుత్వం.డిజిటల్ లావాదేవీలు పెంచితే ఒకవైపు ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాదు కరెన్సీ ద్వారా వచ్చే రోగాలు కూడా తగ్గుతాయి అంటారు నిపుణులు.నోట్లు ప్రతి నిమిషం ఒకరి చేతి నుంచి ఇంకో చేతికి మారుతూ ఉంటాయి.పాతనోట్లను పరిశీలిస్తే వీటిలో 19 రకాల సూక్ష్మజీవులు గుంపులు గుంపులుగా ఉండటం గమనించారట.ఇందులో స్టాఫైలో కోకస్, ఎన్ టెరో కోకస్ బాక్టీరియాలు కనిపించాయట.ఇవి ప్రాణాంతకమైన బ్యాక్టీరియాలు గాలిలో ఉండే బాక్టీరియా మాటిమాటికి మారే చేతుల నుంచి అంటుకునే బాక్తీరియాలో ఇవి ప్రమాదకరం ఈ ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఒకరి నుంచి మరొకరికి బదిలి అవుతూ ఉంటాయి.కాగితాలే కాదు నాణేలు మరి ప్రమాదకరం పిల్లలు వీటిని నోట్లో పెట్టుకున్న సరికోత్త జబ్బులు వస్తాయి అంటున్నారు వైద్యులు.

Leave a comment