పచ్చని పచ్చిక బయలు నీలాకాశంలో తెల్లని మబ్బు తుంపరలున్న ఈ ఫోటో గ్రాఫ్ ను ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటారు. ఎక్స్ పీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కు డీఫాల్ట్ డెస్క్ టాప్ వాల్ పేపర్ గా ఉంది. ఈ ఫోటో నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో గ్రాఫర్ చార్లెస్ ఒరేర్ ఈ ఫోటో తీశాడు. ఇమేజ్ టైటిల్ ‘బ్లిస్’ ఇది డిజిటల్ పెయింటింగ్ కాదు. 1996లో కాలిఫోర్నియా నాసాలోని తన స్నేహితుల ఇంటి నుంచి రోడ్డు మార్గంలో వెళ్తూ ఒరేర్ ఈ ఫోటో తీశాడు. నీలాకాశం ,పచ్చిక చూసి బావుంటుందని కారు దిగి ఈ ఫోటో తీశాడు.ఇది ఆర్డినరి షాట్ అనుకున్నాడు. కొన్నాళ్ళకు అతని ఫోటో డిఫాల్ట్ డెస్క్ టాప్ స్క్రీన్ గా మైక్రోసాఫ్ట్ ఎంచుకున్నట్లు తెలియజేసింది. ఈ ఫోటో మైక్రోసాఫ్ట్ చెల్లింపులన్నింటిలో ఇది రెండో ఖరీదైందట.అంత డబ్బు వచ్చిపడింది ఒరేర్ కు.

Leave a comment