ఇవ్వాల్టి అమ్మాయిలు అన్నింటా ఎక్స్ పార్ట్సే. సంపాదించే విషయంలో ఆదా చేసే విషయంలో కుడా ఇందుకు విద్యాబాలన్ మినహాయింపు కాదు. ఆమె చూపెడుతున్న మనీ టిప్స్ ఇవ్వాల్టి యువతరం ఆమోదించినవే. ప్రతి నెలా సంపాదనలో కొంత ఇవతల పెట్టాలి. డబ్బును చూసి భయపడొద్దు. దీన్ని పోగు చేయాలి అంటుంది విద్యాబాలన్. నా తోలి పెట్టుబడి చెంబూర్ లో ఒక ఫ్లాట్. ఇక ఇల్లు కొనే పని పెట్టుకోలేదు. ఇప్పుడు ఆదాయం క్రమం తప్పకుండా వచ్చే బ్రాండ్స్ లో పెడుతుంటాం. ఇప్పుడు నాకు ఆదాయ మర్ఘాల విషయంలో రకరకాల పెట్టుబ్బడులు, వాటి పైన వచ్చే ఆదాయం గురించిన విషయాలు తెలుసు. ఆడవాళ్ళు, ఇది మనం పని కాదనుకొంటారు కానీ ఎదినా, ఎవరైనా తెలుసుకుంటే తెలిసిపోతుంది. అదేం బ్రహ్మ విద్య కాదు. మన డబ్బు పైన, దేని పైన ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేయాలో దాని పైన మనకి అవగాహన ఉండాలి. ఖర్చు చేయడం లోనే కాదు, ఆదా చేయడంలో కుడా మహిళలు నేర్పు సాధించాలి అంటుంది విద్యాబాలన్. కరెక్టే కదా!

Leave a comment