నీహారికా,

నీ ప్రశ్న అలోచింపజేసేదే. ఎంతో మంది దంపతులు ఒక్క బిడ్డ వుంటే చలనుకోంటున్నారు. అలా ఒక్కడే వుంటే ఇక ఆ ఇంటి అతి గరబామే. సింగిల్ చెయిల్డ్ అయితే స్పాయిల్ అవుతారు. స్వార్ధంతో ఒంటరి తనంతో మొండిగా ఉంటున్నారని సాధారణంగా వినబడే కామెంట్. ఇలాంటి వ్యాఖ్యానాలను ఖండించడానికి ఎన్ని ఉదాహరణలు వున్నాయో సపోర్టు చేయడానికి అన్నే ఉదాహరణలున్నాయి. ఇంట్లో ఒక్క బిడ్డే వుండటం తో సాధారనంగా తల్లిదండ్రుల ఫోకస్ ఎటేన్షన్ ఎక్కువే ఉంటాయి. తల్లి బిడ్డలకు కావాల్సిన ఎన్నో అవకాశాలను డబ్బుతో సమకూరుస్తారు. తల్లి దండ్రులు.. ఇక్కడ డబ్బు విలువ నేర్పడంలో తల్లిదండ్రుల పాత్ర పరిమితమై పోతుంది. వాళ్ళే డబ్బుని డబ్బుతో వచ్చే సౌలభ్యాన్ని పిల్లలకు పరిచయం చేస్తున్నారు. చాలా చిన్న వయస్సు నుంచి పాకెట్ మనీ, టు వీలర్స్, ఇంకాస్త పెద్దయితే ఫోర్ వీలర్స్ ఎన్నో అందుబాటులోకి తెస్తారు. అయితే పిల్లల్ని ఇలా కాకుండా అతిగా పాంపర్ చేయకుండా పద్దతిగా పెంచాలంటే వాళ్ళ మానసిక ఆరోగ్యం బావుంటుంది. చిన్నతనం నుంచే వారికి షేరింగ్ ధోరణి అలవరిస్తే స్వార్ధ పూరితమైన ఆలోచనలు రావు. ఒక్క బిడ్డయినా, ఇద్దరయినా వాళ్ళని క్రమశిక్షణతో పెంచాగలగడం తల్లిదండ్రుల చేతుల్లోనే వుంది.

Leave a comment