Categories
WoW

డబ్బుకి బంధువులు దొరకుతారు

ఈ ప్రపంచంలో వింత లన్నీ మనం సృస్టిస్తేనే వస్తాయి. అమ్మానాన్నలకు ఇంట్లో చోటు లేకపోవడం ఒక వింతయితే, ఆ ఒంటరిగా మిగిలిన ముసలి వాళ్ళకు అద్దెకు బంధువులు దొరకడం ఇంకో వింత. అందాటిన వంటరిగా వుండే పెద్దవాళ్ళకోసం గంటలో 120 నుంచి నెలకు 20000 అద్దె చెల్లిస్తే తోడుగా, బంధువుగా వుండే మనవడో, మనుమరాలో దోరుకుతారు. ఢిల్లీ, పూణే, గుర్ గావ్, అహ్మేదబాద్ మొదలైన నగరాల్లో ఈ తరహా సంస్థలు చాలానే ఉన్నాయి. ఇంకా పుట్టుకొస్తాయి కూడా. ది స్వామిలా మెంబర్, ఆజీకేర్, samvedna ఇలాంటివి ఎన్నో. పెద్దలతో కలిసి కబుర్లు చెప్పేందుకు పక్కనే కుర్చుని టి.వి చూసేందుకు పెళ్లిళ్ళు శుభకార్యాలకు తోడుగా వెళ్లేందుకు ఆసుపత్రులకు, బ్యాంకులకు తోడుగా వచ్చేందుకు అద్దె బందువులు దొరుకుతున్నారు. ఈ వాలంటీర్ సంస్థలు పెద్దవాళ్ళకు సేవ చేసి నట్టు ఉండి. వాలంటీర్లకు ఆర్ధిక అవసరం తీరినట్లు ఉంది. రెండూ లాభాలే. రెండు పరస్పర అవసరాలే.

Leave a comment