ఉంగరాల్లో ముచ్చటైన కొత్త డిజైన్లు వచ్చాయి . డబుల్ రింగ్స్ ,అలాగే ఉంగరాల ను కలుపుతూ సింగిల్ ,డబుల్ లేయర్డ్ చెయిన్లు వచ్చాయి . కుందన్స్ ,స్టోన్స్ ముత్యాల దండలతో ఉన్న డబుల్ ఫింగర్ రింగ్స్ ఎనెన్నో మోడల్స్ లో బంగారం ,ఫ్యాషన్ జ్యువెలరీ కూడా కనిపిస్తుంది కొన్ని డబుల్ రింగ్ ఒకే పరిమాణంలో కొన్ని ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఒకటి వాటిని కలుపుతూ బంగారు చెయిన్ లు ముత్యాల దండలలో ఉన్నాయి . ఒక రింగ్ వేలంతా కప్పేస్తూ ఉంది . దాన్ని ఇంకో వేలికున్న చిన్ని రింగ్ తో కలుపుతూ బంగారు చైన్ తో ఈ డబుల్ రింగ్స్ ఇప్పుడు వేడుకలకు ప్రత్యేకం చక్కని మెహందీ ,నెయిల్ పాలిష్ తో ఈ డబుల్ రింగ్స్ వేళ్ళ అలంకరణ తో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి .

Leave a comment