జీవనశైలి మార్చుకొంటే పెరిగే వయస్సు కనిపించదు. ఐదు పదులు దాటిన ఇక జీవితం అయిపోయినట్లే అనుకోకండి శరీరం ఫిట్ గా ఉంచుకొనేందుకు ముందు అరగంటైనా వ్యాయామం కోసం ఖర్చు చేయండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కళ్ళచుట్టు ముడతలు పెరిగి వయసుని చూపెడతాయి. చర్మం సాగే గుణం పోగోట్టుకొని మొరుపు తగ్గిపోతుంది. ముందు ఆహారం పైన శ్రద్ధ పెట్టాలి. పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. రాగి జావా ,ఓట్ మీల్ ,ఉడికించిన కోడిగుడ్లు ఆకు కూరలు, కాయగూరలు ,పండ్లు సోయా తీసుకోవచ్చు .శరీరానికి పోషకాలు అంది జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. వీటిలో ఉండే కాల్షియం .ఐరన్ జుట్టు చర్మం ,ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. చక్కని శృంగార జీవితం గడుపుతూ కుటుంబ సంబంధాలు ధృఢంగా ఉంచుకోగలిగితే వార్ధక్యానికి చోటుండదు అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment