ఎన్నో పోషకాలున్నా బార్లీ ఈ వేసవికి సహజ సిద్దమైన జౌషధం. కాల్షియం ,ఇనుము ,మాంగనీస్ ,మెగ్నిషియం ,జింక్ ,రాగి వంటి ఖనిజాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి బార్లీలో. ఈ గింజలు గుండె జబ్బులను దగ్గరుకు రానివ్వవు. అధిక బరువు తగ్గిస్తాయి.కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఈ బార్లీ తో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది. బార్లీ లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించి పొడి చేసి నాలుగు కప్పుల నీళ్ళు మరగనిచ్చి ,పావు కప్పు నీళ్ళలో బార్లీపొడి రెండు స్పూన్లు కలిపి నీళ్ళలో పోస్తే వచ్చిన మిశ్రమాన్ని వడకట్టి అందులో పల్చని మజ్జిగ ,చిటికెడు ఉప్పు వేసి తాగితే దాహం వేయకుండా ఉంటుంది.

Leave a comment