Cinnamonum అనే చీట్టు బెరడు దాల్చిన చెక్క భారతీయ మసాలా దినుసుల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యం. ఈ చక్క జీవక్రియలో పనిచేస్తుందని తాజా పరిశోధన చెపుతుంది. ఫార్టేస్ దియాబెటీస్, ఒబేసిటీ అండ్ కోలెస్ట్రోల్ ఫౌండేషన్లో నిర్వహించిన ఈ పరిశోధన వివరాలులిపిడ్స్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. ఉదర కోశ ఊబకాయం, మధుమేహం, అధిక స్ధాయి ట్రై గ్లిజరాయిడ్స్, హైపర్ టెన్షన్ తదితర సమస్యలకు దాల్చిన చెక్క దివ్యౌషుదం అని జర్నల్ లో వైద్యులు సూచించారు. ఆహారంలో ప్రతి రోజు దాల్చిన చెక్క పొడి తీసుకుంటే దానితో పాటు వేగంగా నడిచే వ్యయామం 45 నిమిషాలు చేయగలిగితే బరువులో సరాసరి 4 కిలోలు తగ్గవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. రక్త పోటు కోలెస్ట్రోల్ ఇతర అంశాల్లో మెరుగైనఫలితాలు నమోదైనట్లు తెలిపారు. మనిషి జీవక్రియను ఈ ఆహార దినుసు మెరుగుపరుస్తుందని వెల్లడించారు.
Categories