సీజన్ తో  సంబంధం లేకుండా ఎక్కువ సమయం ఎసి ల్లో గడిపేయటం యువతరానికి అలవాటైపోయింది. గంటలకొద్దీ గడపటం వల్ల శరీరం సేద తీరుతుంది కానీ కళ్లకు సమస్య వస్తోంది అంటున్నారు పరిశోధకులు డ్రై ఐ  సిండ్రోమ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.ఇలాంటి ఇబ్బంది వేసవిలో ఎక్కువ అంటున్నారు. రోజుకు 16 నుంచి 18 గంటలు ఎసి ల్లో  గడపటం వల్ల కళ్లు పొడిబారిపోవడం కంటి నుంచి నీరు కారటం దురద మంట చూపు మసకబారడం వంటి సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాల్లో గుర్తించారు. ఆఫీస్ ల్లో కూడా మధ్య మధ్య ఎసి నుంచి బయటికి వస్తూ ఉంటేనే మంచిదంటున్నారు.

Leave a comment