Categories
Nemalika

దాంపత్యపు తొలి రోజుల్లోనే బీజం.

నీహారికా,

నీ డౌటు కరెక్టే. ఎంతో ప్రేమ పూర్వకంగా ఒక్కటైనా భార్య భర్తల మద్య విడిపోలేనంత ద్వేషాలు ఎలా వస్తున్నాయి. ఇద్దరిలో ఎవరిది తప్పు. ఈ ప్రశ్నకు భార్యాభర్తలు తోలి రోజుల్లో కాపురం పెట్టాక వాళ్ళ మధ్య ప్రవర్తన నిర్ణయించి జవాబు చెప్పుతుంది. బహుశా ఇద్దరికీ చిన్న మాటల్లో చినపాటి అలకల్లో, కోపంతో చేయేత్తటం, బార్యని దండిచడం, విసుక్కోవడం లేదా భర్తననే ఇగో చూపించడం భర్త తప్పయితే. ఆనిమిషoలో  కాపోయిన తనక ుఏమి కావాలో, సంసారం ఎలా ఉండాలని అనుకుంటుందో జరిగిన సంధర్బంలో తనది తప్పా, ఒప్పా లేదా ఇవన్నీవివరించని భార్యదీ తప్పు.  ఫలితంగా సంసారంలో అసంతృప్తి మొదలవతుంది కదా. సమస్య మొదట్లోనే ఇద్దరు మాట్లాడుకుంటే బావుటుంది. ఒకరి కోపాన్ని రెండవ వారు భరించడం వల్ల ఉన్న సమస్య ఎక్కువ అవతుంది. కానీ పరిష్కారం కాదు. వ్యతిరేక భావనలతో ప్రారంభమైన సంసారాలు నిలవవు. నిలబడినా తీవ్రమైన అసంతృప్తత  పరస్పరం ప్రతి చిన్న విషయానికి కలహానికి కాలుదువ్వుతారు. అందుకే తొలి రోజు నుండే ఇద్దరు మాట్లాడుకొని ప్రతి విషయం పరిష్కరించుకోవాలి.

Leave a comment