సంక్రాంతి రోజులు బావుంటాయి. ఇప్పుడీ పల్లెటూరి సంక్రాంతి అందాలు సినిమాల్లో చూడాల్సిందే. అపార్ట్మెంట్ కల్చర్ తో సంక్రాంతి వేడుక ఇంకో విధంగా వుంటుందనుకోండి. గంగి రెద్దు మేళం రాదుగా సన్నాయి వాయిస్తూ ముందర ఒకడువస్తుంటే శృతిని వాయిస్తూ మద్దెలతో ఇంకొకరు వెనకగా నడుస్తూ ఉంటే ఇద్దరి మధ్యను అలంకారంతో గంగిరెద్దు. ఈ ఎద్దు ఏం చెపుతుందంటే ? ఓ యజమానీ అన్నదాతా ఆషాడంలో తొలకరి తొలిచినుకు పడిన దగ్గర నుంచి మీ ఏఇంట్లో గేదెలు నిండేవరకు చక్కని శ్రమ చేసి నిన్న ధనవంతుడిని చేసిన శ్రామికుడిని నన్ను గుర్తించు. అంటుందిట. మేత పెట్టి నీళ్లు తాగించి వీపు నిమిరితే ఆనందించే ఎద్దు అల్ప సంతోషం జీవితంలో మానసిక ఆనందాన్ని ఇస్తుందని అదే దివ్యౌషధం అని చెపుతోంది. అహంకారం లేకుండా ఆనందంగా వుండు అని చెప్పేందుకే ఈ గంగిరెద్దు సన్నాయి మేళం అంటారు పెద్దలు. మనిషి జీవితంలో కొందరికి రుణపడి ఉండాలి కొందరి రుణం తీర్చుకోవాలి.

Leave a comment