ఆ తోటలో పూవులు ఎప్పటికీ వాడవు. ఆకులు ఎండిపోవు పచ్చని గడ్డి ,మల్లెలు,మందారాలు చామంతులు గులాబులు చిన్న సరోవరం, అందులో తేలే తామర పూలు . ఇవన్ని కష్టపడి చేతులతో తయారు చేసిన అపురూపమైన తోట. 50 మంది మహిళలు ఎలాటి సూది,యంత్రం ఉపయోగించకుండా 12 సంవత్సరాల పాటు కష్టపడి అల్లారు కేరళ లో అద్యాపక వృత్తిలో ఉన్న ఆంటోని జోసెఫ్ నేతృత్వంలో మహిళలు ఈ పూల తోట ను అల్లారు. ఈ తోట ముందుగా కేరళ లోని మళ్ళం పుళ లో వుండేది . 2002 లో వరదలు రావటంతో ఆతోటను ఊటీకి తీసుకొచ్చారు. ప్రపంచంలోనే తోలి దారాల తోట గా గిన్నిస్ లోకి ఎక్కింది.

Leave a comment