రాకపోకలకు అడ్డంగా ఉన్న ఒక కొండను తవ్వి రహదారి వేశాడు దశరథ్ మాన్జీ . గయా కు దగ్గరగా గెహతేర్ అనే కుగ్రామంలో పుట్టాడు దశరధ్ . వాళ్ళ ఊరి చివరి కొండా దాటుకొని పక్కఊరికి వెళ్ళవలసి వచ్చేది . కొండదాటి మందులు తెచ్చేసరికి కాలాతీతమైన దశరథ్ భార్య మరణించింది . ఈ సంఘటన తర్వాత దశరథ్ కొండని కదిలించాలను కొన్నాడు కొండను తవ్వి రహదారివేసేపని మొదలుపెట్టాడు . మొదట్లో గ్రామస్థులు అతన్ని ఎగతాళి చేశారు . దశరథ్ ఎవ్వళ్ళని పట్టించుకోలేదు . 22 ఏళ్ళపాటు ను ఆకొండను తవ్వి ఒక రహదారి వేశాడు . 360 అడుగుల పొడవు,36 అడుగుల వెడల్పు గల ఈ దారి అజ్రి ,వజ్రగంజ్ వెళ్ళే దూరాన్ని 15 కిలోమీటర్లు తగ్గించింది . లేకపోతే గయా సమీపంలో ని ఈ గ్రామస్థులు వెళ్ళాలంటే 70 కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది . బీహార్ ప్రభుత్వం అతను తవ్విన రోడ్డు కు అతని పేరే పెట్టేసింది మనిషి సంకల్పానికి ఎదురేమిటి ?.
Categories