ఒక్క యువతి  తీసుకొన్న శ్రద్ద అస్సాం లోని హార్గలా అని పిలిచే స్టార్క్ పక్షులకు ఆవాసం ఏర్పడింది . అస్సాంలోని సెన్సోలా కుతి కోసియా గ్రామాల్లో స్టార్క్ పక్షులు అక్కడి సిల్క్ చెట్లపైన గుళ్ళు కట్టుకొని గుడ్లు పొదిగి సంతానాన్ని అభివృద్ధి చేసుకొంటాయి . అయితే ఇష్టం వచ్చునట్లు చెట్లు నరకడం వల్ల ఈ జాతి అంతరించి పోవటం ప్రారంభించింది . ఐక్యరాజ్య సమితి కూడా వాటిని అంతరించి పోయిన పక్షుల జాబితాలో చేర్చింది . 2008లో ఈ పక్షులపైనా రీసెర్చ్  కు వచ్చిన పూర్ణిమాదేవి స్టార్క్ పక్షులు సంఖ్య తగ్గిపోవడం చూసి అరణ్యక్ అనే ఎన్జీవో తో సంప్రదించింది . వాళ్ళ గ్రామస్తులతో  మాట్లాడి అవగాహణ కలిగించారు . గ్రామాలలో స్త్రీలు సానుకూలంగా స్పందించి చెట్లను ,చెట్లపైన ఉన్నా గుళ్ళను దత్తత తీసుకొన్నారు . స్త్రీలు చెట్లను నరకానివ్వరు పక్షి గుళ్ళను ఎంతో శ్రద్దతో కాపాడుతారు . ఇప్పుడా గ్రామాలన్నీ స్టార్క్ పక్షి గుళ్ళతో కళకళలాడుతున్నాయి .

Leave a comment