జయ గురు దత్త…శ్రీ గురు దత్త
మహబూబ్ నగర్ జిల్లాకు సమీపంలోని వల్లభాపురం నందు గానగాపూర్ లో మనకు  దత్తాత్రేయ మఠం దర్శనం కలుగుతుంది.
శ్రీ  నరసింహ సరస్వతీ స్వామి వారి సన్నిధిలో భక్తులు పాలు పంచుకోవడం విశేషం.ఇక్కడకి వచ్చి త్రిముఖ దత్తాత్రేయ దర్శనం చేసుకున్న కొంగు బంగారమే.స్వామి వారికి కాషాయ రంగు దారంతో ముడుపులు కడతారు.
పూర్వం చరిత్రానుసారం ఇక్కడ అశ్వధ్ధ అను వృక్షం పైన  ఒక బ్రహ్మరాక్షసి నివసిస్తూ ప్రజలను హింసించేది.నరసింహ సరస్వతీ స్వామి వారి సన్నిధిలోని దత్తాత్రేయని మహిమతో ఆ వృక్షం పవిత్రమైనది.ఇక్కడ నిత్యం దత్త పారాయణం చేసి మొక్షము పొందుతారు.వేద పాఠశాల విద్య అద్భుతమైన శిక్షణ.శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వారికి ఎనమిది మంది ప్రియ శిష్యులు.గంగమ్మ తల్లి స్వామి వారి పాదాలూ పవిత్రం చేయటానికి ఉరుకులు పరుగులతో ప్రవహిస్తుంది.ఇంత టి చరిత్ర గల దేవాలయాన్ని సందర్శించాల్సిందే మరి!!

  ఇష్టమైన రంగులు: కాషాయం
నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు,కేసరి

కేసరి తయారీ: ఒక కప్పు బొంబాయి రవ్వ, నాలుగు కప్పుల నీళ్ళు/పండు రసం చేసి,ముందు రవ్వ దోరగా వేయించాలి తరువాత,నీళ్ళు/ పండు రసం మరగబెట్టాలి అందులో తగినంత పంచదార వేసి వేయించిన రవ్వని అందులో వేయాలి.అంతే !!

     -తోలేటి వెంకట శిరీష 

Leave a comment